2024-10-30 11:18:00.0
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో దీపావళి సందర్భంగా మరో స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. జియోఫోన్ యూజర్లకు సరసమైన ధరలో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 28 రోజుల వ్యాలిడిటీతో రూ.153 రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది
దీపావళి పండుగ వేళ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సందర్బంగా నయా ఆఫర్ ప్రకటించింది. జియోఫోన్ యూజర్లకు సరసమైన ధరలో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 28 రోజుల వ్యాలిడిటీతో రూ.153 రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆఫర్‌లో యూజర్లు అపరిమిత ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. మొత్తం 300 ఉచిత మెసేజులు లభిస్తాయి. ఇక 0.5 జీబీ రోజువారీ డేటా కూడా లభిస్తుంది.
అదనంగా జియో టీవీ, జియో సినిమా యాప్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్స్ పొందవచ్చు. మూవీస్, స్పోర్ట్స్ లైవ్స్‌తో అందుబాటులో ఉన్న కంటెంట్‌ను చూడవచ్చును. జియోఫోన్ యూజర్లకు రూ. 153 ప్లాన్‌తో పాటు అవసరమైన అదనపు సేవల కోసం కూడా తక్కువ ధరలో ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల రేట్లు రూ.75, రూ.91, రూ.125, రూ.186, రూ.223గా ఉన్నాయి. ఈ ప్లాన్లు అన్నీ జియోఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వర్తించవని రిలయన్స్ జియో పేర్కొంది.
Jio,Jio phone,Diwali,Reliance,New recharge plan,Jio Cinema Apps,Jio TV,Unlimited free calls