దుఃఖం

2022-12-25 11:47:54.0

https://www.teluguglobal.com/h-upload/2022/12/25/432669-sad.webp

దుఃఖం

గుండె తలుపు తట్టే

‌ఆహ్వానం లేని అతిథి

అమాంతం ముంచెత్తే ప్రమేయం లేని ప్రభావం

ప్రమాదం అంచు మీది ఆమోదం

మన అంగీకారాలు అనంగీకారలతో ప్రమేయం లేని

ఆగమనం

తీరాలను ముంచెత్తే అల్పపీడనం

ప్రాంగణంలో నిరాశానిస్పృహలు నాటి

జీవచ్ఛవాల్ని వదిలి పోయే

నిరర్థక నిష్క్రమణం

ఓదార్పు స్పర్శకే తలొగ్గే భూమిక

పలకరింపుకే పులకించిపోయే పాచిక

నిరాసక్త జీవిక.

– వఝల శివకుమార్

Telugu Kavithalu