దుఃఖాన్ని చూడు (కవిత)

2023-02-23 17:32:04.0

https://www.teluguglobal.com/h-upload/2023/02/23/724304-kandhukuri.webp

దాన్ని చూడటానికి దేనినుండైనా చూడొచ్చు

ఒక రసమో ధ్వనో

నీ నరములో నానుతూ ఉండాలి!

అది గొప్ప అందం

అవయవాలు వ్యాయామం చేస్తున్న సౌందర్యం

ఒక నాట్య భంగిమ

ఒక ప్రకృతి ఆకృతి

దాన్ని చూడటానికి దేనినుండైనా చూడొచ్చు

సంతోషం స్వర్గం

స్వర్గాన్ని చూసి రాయటానికి ఏముంటుంది

అంతా అనిమిషలోచనామయం

దుఃఖం నరకం

చూస్తే నరకాన్ని చూడాలి !

టపటపా కొట్టుకుంటున్న

ఎన్నో కంటిరెప్పల్ని చూడొచ్చు

అందాన్నీ ఆనందాన్నీ సుఖాన్నీ కాదు

దుఃఖాన్ని చూడు !

కనుకొలుకుల్లోరాలుతూ ఆగిపోయిన అశ్రుబిందువు చూడు !

కానీ,

నీవు దుఃఖ పడితే తప్ప దుఃఖాన్ని చూడలేవు !!

-కందుకూరిశ్రీరాములు

Dukhanni Chudu,Kandukuri Sriramulu,Telugu Kavithalu