దుబ్బాక మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. హరీశ్ రావు సంతాపం

https://www.teluguglobal.com/h-upload/2024/11/25/1380637-harish-rao.webp

2024-11-25 05:24:42.0

సిద్దిపేట జిల్లా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే డి.రామచంద్రా రెడ్డి కన్నుమూశారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే డి.రామచంద్రా రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1985లో దోమ్మాట అనగా (ప్రస్తుత దుబ్బాక నియోజకవర్గం)నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతిపట్ల బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన సేవలు నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి అని కొనియాడారు. ఎమ్మెల్యే అయినా తన తుదిశ్వాస వరకు సాధారణ జీవితాన్ని గడిపారని, ప్రజాసేవకు పరితపించారని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబానికి హరీశ్ రావు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు సమకాలికుడు కావడం గమనార్హం.ఆయనకు ఇద్దరు కూతురుర్లు ఉన్నారు.

Former MLA D. Ramachandra Reddy,Siddipet District,Dubbaka,Dommata,Harish Rao,kcr,ktr