2024-08-12 08:09:25.0
దువ్వాడ వాణి, దివ్వల మాధురి మధ్య మాటల యుద్ధం నడిచింది. రెండు మూడు రోజులుగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
https://www.teluguglobal.com/h-upload/2024/08/12/1351648-twist-in-the-duvvada-srinivas-affair-case-registered-against-madhuri.webp
ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. దువ్వాడ శ్రీనుతో సంబంధం పెట్టుకుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న పలాస జాతీయ రహదారిపై యాక్సిడెంట్ చేసినందుకు గానూ ఆమెపై కేసు ఫైల్ చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించినందుకు చట్ట ప్రకారం ఆమెపై కేసులు పెట్టారు. BNS 125 కింద మాధురిపై కేసు నమోదైంది.
దివ్వల మాధురితో దువ్వాడ శ్రీను సంబంధం పెట్టుకుని తమకు దూరంగా ఉంటున్నారని ఆయన భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు ఆందోళనకు దిగారు. ఐదోరోజు టెక్కలిలోని శ్రీనివాస్ ఇంటి ముందు వారి నిరసన కొనసాగుతోంది. దువ్వాడ వాణి, దివ్వల మాధురి మధ్య మాటల యుద్ధం నడిచింది. రెండు మూడు రోజులుగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు దివ్వల మాధురి యాక్సిడెంట్‌కు గురైంది. తనకు ప్రమాదం జరగడానికి కారణం వాణియే అని మాధురి ఆరోపించారు. ఆమె పోరు పడలేకనే ఇలా యాక్సిడెంట్ చేసుకుని చనిపోవాలని అనుకున్నానని చెప్పారు.