దువ్వాడ శ్రీనివాస్, మాధురిలకు షాక్..తిరుమలలో కేసు

2024-10-10 15:22:31.0

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు షాకిచ్చారు. టీటీడీలో ఫొటో షూట్ చేసినట్టు మాధురిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు

https://www.teluguglobal.com/h-upload/2024/10/10/1368069-devuda.webp

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు షాకిచ్చారు. పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయం వద్ద ఫొటో షూట్ చేసినట్టు మాధురిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై టీటీడీ పోలీసులు కేసు నమోదు చేశారు.. గత కొన్ని నెలలుగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం మీడియాలో ప్రముఖంగా కనిపిస్తోంది. దువ్వాడ భార్య వాణి మీడియాకెక్కడంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఇటీవల తిరుమలలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో.. నెటిజన్లు అసలు వీళ్లు కొండపై ఏం చేశారనేది లోతుగా పరిశీలించారు. ఆ క్రమంలో ఒక విషయం బయటపడింది. తాను దివ్వెల మాధురిని వివాహం చేసుకోలేదని అన్నారు. తన భార్య వాణితో తన విడాకుల కేసు కోర్టులో ఉందనీ, కోర్టు కేసు పూర్తయిన తర్వాత, పెళ్లి చేసుకుంటామని దువ్వాడ తెలిపారు. విడాకులు తీసుకోకుండా.. మరి ఈ చెట్టాపట్టాలేంటి, ఫొటోషూట్లేంటి అని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.