2024-09-23 15:13:25.0
భారీ బడ్జెట్‌తో వస్తున్న దేవర మూవీ టికెట్స్‌ను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటిగంట షోలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దేవర సినిమా టికెట్ల రేట్ల పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. సెప్టెంబర్ 27న రాష్ట్రంలోని 29 థియేటర్లలో రూ. 100 పెంచి మిడ్ నైట్ ఒంటి గంటకు అదనపు షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అన్ని థియేటర్లలో తెల్లవారుజామున 4గంటలకు రూ.100 పెంచి రోజుకు 6 ఆటలు వేసుకోవటానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇక సెప్టెంబర్ 28 నుంచి ఆక్టోబర్ 6 వరుకు సింగిల్ స్క్రీన్లలో రూ.25, మల్టీప్లెక్సులో రూ. 50 పెంచుకోనేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను భారీగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్సుల్లో గరిష్ఠంగా రూ.130, సింగిల్ స్క్రీన్లలో రూ.110 వరకు హైక్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇక.. అర్థ రాత్రి షోలకు కూడా ఏపీ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. దీంతో.. విడుదలయిన రోజున ఆరు షోలు ఆడనున్నాయి. ఆ తర్వాత 5 షోలు ఆడించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ పెంచిన రేట్లు, అదనపు షోలు 9 రోజుల పాటు కొనసాగించుకునేలా ఏపీ సర్కార్ వెసులు బాటు కల్పించింది. యుంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటల శివ కాంబినేషన్‌లో జాన్వీకపూర్ హీరోయిన్ వస్తున్న భారీ మూవీ
Devara movie,Jr NTR,Koratala Shiva,Janhvi Kapoor,Shreyas Media,Saif Ali Khan,Movie Tickets,Extra show