దేశంలోనే తొలిసారిగా మంకీ పాక్స్‌ నిర్ధారణ కిట్‌ తయారీ

2024-08-25 08:18:38.0

ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లో ఉన్న ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్‌ సంస్థ ఎర్బా ఎండీఎక్స్‌ పేరుతో ఈ కిట్‌ను రూపొందించింది. అంతేకాదు.. ఈ RT-PCR టెస్టింగ్‌ కిట్‌కి భారత వైద్య పరిశోధన మండలి ధ్రువీకరణ పత్రం కూడా అందజేసింది.

https://www.teluguglobal.com/h-upload/2024/08/25/1354641-andhra-pradesh-medtech-zone-launches-indias-first-indigenously-developed-monkeypox-rt-pcr-kit.webp

మంకీపాక్స్‌.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వ్యాధి ఇది. మంకీ పాక్స్‌ కేసులు ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కోవిడ్‌ వైరస్‌ మిగిల్చిన విషాదాన్ని ఇంకా మరువకముందే.. ఇప్పుడు మంకీ పాక్స్‌ వ్యాప్తి చెందుతుండటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోనే తొలిసారిగా మంకీ పాక్స్‌ వ్యాధిని నిర్ధారించేందుకు కిట్‌ను రూపకల్పన చేశారు. ఈ RT-PCR కిట్‌ విశాఖపట్నంలో తయారవ్వ‌డం విశేషం.

ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లో ఉన్న ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్‌ సంస్థ ఎర్బా ఎండీఎక్స్‌ పేరుతో ఈ కిట్‌ను రూపొందించింది. అంతేకాదు.. ఈ RT-PCR టెస్టింగ్‌ కిట్‌కి భారత వైద్య పరిశోధన మండలి ధ్రువీకరణ పత్రం కూడా అందజేసింది. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నుంచి అనుమతిని కూడా పొందింది. ఈ కిట్‌ ద్వారా గంటలో మంకీపాక్స్‌ వ్యాధి నిర్ధారణ ఫలితాలు తేలనున్నాయి. కోవిడ్‌ మాలిక్యులర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాబ్‌లో వీటిని తయారు చేసి ప్రయోగాలు నిర్వహించినట్టు సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ సురేష్‌ వజిరానీ తాజాగా వెల్లడించారు.

Andhra Pradesh,MedTech Zone,Launches,India,First Indigenously,Developed,Monkeypox,RT-PCR kit