2023-03-07 08:36:00.0
https://www.teluguglobal.com/h-upload/2023/03/07/725917-dehabhasha.webp
నా ఇంటి పేరు
మెన్స్స్ట్రుయేషన్…
నా ఒంటి పేరు
పీసీఓడి…
అత్తగారింట్లో
నా ఒంటి పేరు
ఓవర్ వెయిట్…
మంచానికి మూడొస్తే
వాంటెడ్ ప్లేస్ లో
హెయిర్ గ్రోత్ ని…
కడుపు నొప్పొస్తే
మాత్రం అతని
కళ్లకు నేనో
అన్ వాంటెడ్
హెయిర్ లాస్ ని…
అతని నవ్వులో
నా మూడ్ స్వింగ్స్
ఒక వెటకారం…
ఫైనల్ గా
నా డిప్రెషన్
అతనికి ఒక ఎగ్జిబిషన్…
తరతరాల
యుద్దం ఇది…
అంతం లేదు…
నా చుట్టూనే ప్రపంచాన్నల్లుకుంటూ…
నన్నో ముళ్లకంపగా
చిత్రించే
పురుష పౌరుష
పుంగవులకు…
మగాను భావులకు…
మీరు రాసిన
రాజ్యాంగంలో
స్వేచ్ఛను కోల్పోయిన
దేవదాసీలమే…
మించిపోయిందేమీ
లేదు…
మేమూ కొత్త
రాజ్యాంగం
రాయాల్సిన సమయమొచ్చింది…
మీ రాజ్యాంగాన్ని
తగలెట్టాల్సిన
క్షణమొచ్చింది..
పీరియడ్స్ ఆగిపోయిన
మా తరం కోసం
కాదు…
కొత్త రక్తంతో ఉరకలెత్తే
ఉత్సాహంతో
మరో తరానికి ప్రాణం
పోసే నవయువతరం కోసం..
న్యూ జనరేషన్
అమ్మల కోసం
– అమూల్యచందు
( విజయవాడ )
Dehabhasha,Amulya Chandu