దొంగను పట్టుకునేందుకు ప్రయత్నం..రైలు ఢీకొని జవాన్‌ దుర్మరణం

2025-02-15 14:37:02.0

అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.

అనంతపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది. తన భార్య మెడలోని బంగారు గొలుసును దొంగ లాక్కొని పరారవుతుండగా.. పట్టుకునే క్రమంలో మరో రైలు ఢీకొని ఓ ఆర్మీ జవాన్‌ దుర్మరణం పాలయ్యారు. ఈఘటన దిల్లీకి 50 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రానికి చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ లక్ష్మన్న ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రైలు ఢీకొని మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మన్న తన కుటుంబ సభ్యులతో కలిసి విధుల నిమిత్తం కాశ్మీర్‌కు బయలుదేరారు.

అయితే ఢిల్లీలో రైలు ఎక్కుతున్న సమయంలో తన భార్య మెడలోని గోల్డ్ చైను దొంగ అపహరించాడు. దీంతో పారిపోతున్న దొంగను లక్ష్మన్న పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో లక్ష్మన్న అదుపుతప్పి ట్రాక్ పై పడడంతో రైలు ఢీకొంది. స్పాట్ లోనే లక్ష్మన్న మృతి చెందాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జవాన్ లక్ష్మన్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. 

Anantapur District,Kalyanadurgam Constituency,Army jawan,Jawan Laxmanna,Kashmir,Brahmasamudram,Hazrat Nizamuddin,West Bengal,CM Chandrababu,Naralokesh,Pavankalayn