ధనశ్రీ నుంచి మరో క్రిప్టిక్‌ పోస్ట్‌

2025-03-11 02:23:55.0

మహిళలను నిందించడం ఎప్పుడూ ఫ్యాషనే అంటూ ఇన్ స్టా సోర్టీలో

ధనశ్రీ నుంచి మరో క్రిప్టిక్‌ పోస్ట్‌ వెలువడింది. ‘మహిళలను నిందించడం ఎప్పుడూ ఫ్యాషనే’ అంటూ ఇన్ స్టా సోర్టీలో పేర్కొన్నారు. టీమిండియా ఇండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ ధనశ్రీతో విడాకులు తీసుకుంటున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌ వేదిక జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, రేడియో జాకీ మహ్‌వశ్‌ కలిసి చాహల్‌ మ్యాచ్‌ చూశారు. ఈ నేపథ్యంలోనే ధనశ్రీ క్రిప్టిక్‌ పోస్ట్‌ పెట్టారు. ఈ పోస్ట్ వెంటనే సోషల్ మీడియాలో వైరలైంది. చాహల్‌, మహ్‌వశ్‌ లపై జరుగుతున్న ప్రచారంపై ఇది సూక్ష్మ ప్రతిస్పందన అని చాలామంది వ్యాఖ్యానించారు. క్రికెటర్, రేడియో జాకీ వైరల్ ఫొటోలు వచ్చిన వెంటనే ఆమె చేసిన పోస్ట్‌ ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

Dhanashree Verma Shares,Cryptic Post,After Yuzvendra Chahal-RJ Mahvash Viral Pics,’Blaming The Women