ధైర్యమే కవచం, ఆశనే అతని ఆయుధం

 

2024-10-15 06:35:53.0

https://www.teluguglobal.com/h-upload/2024/10/15/1369024-sdt18.webp

కొత్త సినిమాను ప్రకటించిన సాయి దుర్గాతేజ్‌

 వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోలలో సాయి దుర్గా తేజ్‌ ఒకరు. విరూపాక్ష, బ్రో వంటి హిట్‌ మూవీస్‌ తర్వాత మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. నేడు ఆ యంగ్‌ హీరో పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. #SDT18 వర్కింగ్‌ టైటిల్‌తో ఇది తెరకెక్కనున్నది.

ఈ విషయాన్ని చెబుతూ.. మూవీ టీం ఓ మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. ‘హనుమాన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలను నిర్మించిన కె. నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డిలు ఈ మూవీని ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ఈ సినిమాతో రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ‘ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడుతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అనే క్యాప్షన్‌ తో ఓ వీడియోను విడుదల చేస్తూ చిత్రబృందం సాయి దుర్గా తేజ్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పింది.

 

SDT18,Intrude into the world of Arcady,A special video,on the occasion Sai Durgha Tej Birthday