2023-01-31 11:32:45.0
https://www.teluguglobal.com/h-upload/2023/01/31/721450-dhyeyam.webp
లక్ష్య సాధనే ధ్యేయమై..
బాధ్యతతో వేసే ప్రతి అడుగు,
భారమై బాధించినా….
లక్ష్యాన్ని చేధించిన క్షణాన,
అదో చిరస్మరణీయ
ఘట్టముగా,
నిలిచి పోవడం తథ్యం!!
నిబద్దతను ప్రశ్నించే
కఠినపరీక్షగా,
లక్ష్యసాధన మినహా…
మరో యోచనలేని ఆ నడకలో,
ప్రతి క్షణమూ అమూల్యమే!!
పూలతో సుస్వాగతాలు,
పదునైనరాళ్ళ గాయాలు
వెక్కిరింతల వెకిలి చేష్టలు,
మిశ్రమమై పరీక్షించే
ఆ పయనం,
ఓ వెలరహిత యజ్ఞం-!!
విజేతల వీరగాధలు,
పరాజతుల పరాభవాలు,
కడవరకు పోరాడలేని
అశక్తులు
తతిమ్మా అనుభవాలు
ఈ పయనానికి ఉపకరించే
విలువైన మైలురాళ్లు!!
– సాగర్ రెడ్డి (చెన్నై)
Sagar Reddy,Dhyeyam,Telugu Kavithalu