నటితో కలర్‌ ఫొటో దర్శకుడి నిశ్చితార్థం

 

2024-11-11 15:33:43.0

https://www.teluguglobal.com/h-upload/2024/11/11/1376925-dirctor-actress.jfif

త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న సందీప్‌ రాజ్‌, చాందిని రావు

కలర్‌ ఫొటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్‌ రాజ్‌ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. నటి చాందినీ రావుతో సందీప్‌ రాజ్‌ కు సోమవారం వివాహ నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించనున్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు నెట్టింటింట్లో చక్కర్లు కొడుతున్నారు. సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

 

Color Photo,Director,Sandeep Raj,Actress Chandini Raj,Engagement