నటి రష్మిక మందన్నపై సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్

 

2024-12-26 09:55:27.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/26/1389207-cpi-narayana.webp

పుష్ప-2 ‘పీలింగ్స్’ పాటకు డ్యాన్స్ చేయడం రష్మిక మందన్నకు ఇష్టం లేదని సీపీఐ నారాయణ చెప్పారు.

ప్రముఖ టాలీవుడ్ రష్మిక  పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప-2 సినిమాలో పీలింగ్స్ అనే సాంగ్‌‌లో నటించడం రష్మీకకు ఇష్ట్రం లేదని డైరెక్టర్ సుకుమార్ మాట మీద కష్టంగా ఆమె డ్యాన్స్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. సినీ పరిశ్రమలో ఎంతో మంది మహిళలు ఆత్మాభిమానాన్ని చంపుకుని పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పుష్ప-2′ సినిమాపై కూడా నారాయణ విమర్శలు గుప్పించారు. క్రైమ్, అశ్లీలత ఉన్న సినిమాలకు ప్రభుత్వాలు ఎందుకు రాయితీలు ఇస్తున్నాయని ప్రశ్నించారు. ఒక ఎర్రచందనం దొంగను హీరోగా చూపించారని మండిపడ్డారు. రూ. 100 టికెట్ ను రూ. 1,000 చేయడం ఎందుకని ప్రశ్నించారు. సినిమా హీరోలు రోడ్ షోలు చేయడం ఎందుకని అడిగారు.’ పుష్ప-2′ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 1,600 కోట్లు పైగా వసూళ్లను రాబట్టింది.

 

heroine Rashmika Mandanna,Pushpa-2 movie,Feelings,Director Sukumar,hero allu arujan,CM Revanth reddy,Film industry,Tollywood Sandhya,Theatre,Minister Komati Reddy Venkata Reddy,Dil raju,Hero venkatesh