నటుడు మోహన్‌బాబు ఇంట్లో చోరీ

https://www.teluguglobal.com/h-upload/2024/09/25/1362793-mohan-babu.webp

2024-09-25 06:26:35.0

దర్యాప్తు చేపట్టిన రాచకొండ పోలీసులు నాయక్‌ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు.

నటుడు మోహన్‌బాబు ఇంట్లో చోరీ జరిగింది. నగర శివారు జల్‌పల్లిలో గల నివాసంలో పనిమనిషి నాయక్‌ రూ. 10 లక్షలు దొంగిలించి పారిపోయినట్లు పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన రాచకొండ పోలీసులు నాయక్‌ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. 

అయితే 2019లోనూ మోహన్‌బాబు ఇంట్లో చోరీ జరిగిందని బంజారాహిల్స్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే పనిమనిషే డబ్బు, నగలు చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడూ ఇంట్లో పనిచేసే వ్యక్తే దొంగతనం చేశారని ఫిర్యాదు చేయడం గమనార్హం. 

Thieves,robbed,actor Mohan Babu’s house