2025-02-22 11:14:51.0
ఆరెల్లి మొగిలిని అతని కుమారుడు సాయికుమార్ విచక్షణారహితంగా 10-15 సార్లు పొడిచాడు
మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకున్నది. కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. పోలీసులు కథనం ప్రకారం.. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలిని అతని కుమారుడు సాయికుమార్ ఇద్దరూ ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పనిచేస్తున్నారు. మొగిలి నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తుండటంతో సాయికుమార్ విసిగిపోయాడు. శనివారం మధ్యాహ్నం లాలపేట నుంచి మొగిలి బస్సులో బయలుదేరగా.. అతని కుమారుడు బైక్‌పై అనుసరించాడు. ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద బస్సు దిగిన తండ్రిని.. తన వెంట తెచ్చుకున్న చాకుతో విచక్షణారహితంగా 10-15 సార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన మొగిలిని స్థానికులు సమీపంలో ఉన్న శ్రీకర ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కారణంగానే తండ్రిపై సాయికుమార్ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
Son Saikumar killed,his father Mogili,On the road,Family quarrels,property disputes