నన్ను ట్రోలింగ్‌ చేసి వేధిస్తున్నరు

2024-09-30 13:22:52.0

మంత్రి కొండా సురేఖ

సోషల్‌ మీడియాలో కొందరు తనను ట్రోలింగ్‌ చేస్తూ తిండి, నిద్ర లేకుండా చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గాంధీ భవన్‌ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇన్‌ చార్జీ మంత్రిగా మెదక్‌ జిల్లాకు వెళ్తే ఎంపీ రఘునందన్‌ చేనేతల సమస్యలు చెప్పి చేనేత మాల తన మెడలో వేశారని తెలిపారు. ఆ మాలను తాని పరీక్షగా చూశానని.. ఆ ఫొటోను ట్రోల్‌ చేస్తూ తనను మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. తనకు మద్దతుగా కొందరు బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ కు వెళ్తే వారిని కొట్టారని.. అధికారంలో కోల్పోవడంతోనే బీఆర్‌ఎస్‌ నాయకులు ఇలా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాగే చేస్తే ప్రజలు తిరగబడుతారన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్‌ మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. రఘునందన్‌ కాల్‌ చేసి క్షమించమని అడిగారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ వాళ్లు ట్రోల్‌ చేస్తున్న ఫొటోలో తప్పేముందో కేసీఆర్‌ భార్య శోభమ్మ వాళ్లకు చెప్పాలన్నారు. 

 

konda surekha,photo trolling,social media,harassing