2025-01-13 07:05:38.0
నెలకు సగటున రూ.2 కోట్ల ఆదాయం
ప్రధాని నరేంద్రమోదీకి యూట్యూబ్ నుంచి మస్త్ ఆమ్దానీ వస్తోందట! ఒక నివేదిక ప్రకారం సగటున ఆయనకు నెలకు రూ.2 కోట్ల వరకు యూట్యూబ్ ద్వారా ఆదాయం సమకూరుతుందని అంచన. ”నరేంద్రమోదీ” పేరుతో ఉన్న యూట్యూబ్ చానెల్ కు 26.5 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 29 వేల వీడియోలను తన అధికారిక యూట్యూబ్ చానల్ లో ఆయన పోస్ట్ చేశారు. రాజకీయాలు, అధికారిక కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రధాని తన ప్రతి యాక్టివిటీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ తో పాటు ట్విట్టర్ (ఎక్స్), ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్‌లోనూ ఆయన చాలా యాక్టివ్. ఆయన సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా నిమిషాల్లో వైరల్ అవుతాయి. ప్రధాని మోదీ పోస్ట్ చేసిన వీడియోలకు ఇప్పటి వరకు 636 కోట్ల వ్యూస్ వచ్చాయి. ప్రధానికి నెలకు తక్కువలో తక్కువగా రూ.1.62 కోట్లు, అత్యధికంగా రూ.4.88 కోట్ల ఆదాయం వస్తుందట. ఇది ఒక్క యూట్యూబ్ ఆమ్దానీ మాత్రమే.. మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల ఆదాయం కలుపుకుంటే ప్రధాని నెలకు రూ.3 కోట్లకు పైగా సంపాదిస్తున్నారని అంచనా.
Prime Minister,Narendra Modi,You Tube,Social Media,Millionaire,Rs.2 Crores Per Month