నవరాత్రి సమయంలో హర్యానా విజయం శుభసూచకం : ప్రధాని

2024-10-08 15:55:37.0

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్య విజయం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో పాల్లోని మాట్లాడారు.

https://www.teluguglobal.com/h-upload/2024/10/08/1367456-pm-modi.webp

దుర్గ నవరాత్రి సమయంలో హర్యానాలో విజయం శుభాసూచకమని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో పాల్లోని మాట్లాడారు.హర్యానా గెలుపు భారత ప్రజాస్వామ్య విజయం అని..బీజేపీ కార్యకర్తల కృషితో ఇది సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారన్ని ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. రైతులు తాము బీజేపీ వైపే ఉన్నామని నిరూపించుకున్నారు. హర్యానాలో కమలం మూడో సారి వికసించింది.

జమ్మూ కాశ్మీర్ ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి అధిక సీట్లు వచ్చాయి. బీజేపీకి మాత్రం గతం కంటే అధికంగా ఓట్లు లభించాయి. హర్యానాలో ప్రతీ పదేళ్లకొకసారి ప్రభుత్వం మారుతుంది. కానీ ఈసారి బీజేపీ రికార్డు సృష్టించింది. పలు వర్గాల ప్రజలను కాంగ్రెస్ రెచ్చగొట్టిందని తెలిపారు. హర్యానాలో ఇప్పటివరకు 13సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా మూడుసార్లు గెలిచిన దాఖలాలు లేవని ప్రధాని తెలిపారు.

Haryana Assembly Election Results,BJP,Congress,Exit polls,Rahul gandhi,CM Naib Singh Saini,Pm modi,Jammu and Kashmir