https://www.teluguglobal.com/h-upload/2023/08/15/500x300_810729-laughing.webp
2023-08-15 19:10:12.0
‘నవ్వు నాలుగు విధాలా చేటు’ అనే ఓ పాత సామెత ఉంది. అయితే ఆరోగ్యపరంగా చూస్తే.. ‘నవ్వు నలభై విధాలా మేలు’ అంటున్నారు డాక్టర్లు.
‘నవ్వు నాలుగు విధాలా చేటు’ అనే ఓ పాత సామెత ఉంది. అయితే ఆరోగ్యపరంగా చూస్తే.. ‘నవ్వు నలభై విధాలా మేలు’ అంటున్నారు డాక్టర్లు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా నవ్వు ఎంతో మేలు చేస్తుందట. అదెలాగంటే..
మనఃస్ఫూర్తిగా నవ్వడానికి మించిన మందు మరొకటి లేదంటున్నారు మానసిక నిపుణులు. రోజులో ఒకసారైనా నవ్వకపోవడం వల్ల చాలారకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. నవ్వకుండా ఎప్పుడూ సీరియస్‌గా ఉండేవాళ్లకు ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి త్వరగా దరిచేరతాయట.
పని ఒత్తిడిలో పడి నవ్వడాన్ని చాలామంది మర్చిపోయారు. కానీ, మనకొచ్చే చాలా రకాల మానసిక రుగ్మతలకు అనారోగ్యాలన్నింటికీ నవ్వకపోవడం కూడా ఓ కారణం. బీపీ, ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, మైగ్రేన్ తలనొప్పి వంటి బోలెడు సమస్యలు కేవలం నవ్వడం ద్వారా దూరమవుతాయని పలురకాల పరిశోధనల్లో తేలింది. రోజుకు పది నిమిషాలు నవ్వడం ద్వారా 10 నుంచి -20 మిల్లీమీటర్ల రక్తపోటు తగ్గుతుందని స్టడీల్లో తేలింది. అంతేకాదు, నవ్వడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ కూడా పెరుగుతాయి. నవ్వినప్పుడు హ్యాపీ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. అందుకే అన్నిరకాల మానసిక రుగ్మతలకు నవ్వు మంచి మందుగా పనిచేయగలదు.
ఇకపోతే నవ్వడం వల్ల సహజంగానే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మెదడులో పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వినప్పుడు ముఖం, పొట్టలోని కండరాలు యాక్టివేట్ అవుతాయి. ఒకరకంగా చెప్పాలంటే నవ్వు అనేది ఒకరకమైన శ్వాస వ్యాయామం.
అన్నింటికంటే ముఖ్యంగా ఇతరులతో మంచిగా కమ్యూనికేట్ చేయడానికి, అందరిలో మంచి ఇంప్రెషన్ పొందడానికి ముఖంపై చిరునవ్వు ఉండడం చాలా అవసరం. అలాగే నవ్వు అనేది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అంటే మీరు నవ్వుతూ ఉండడం ద్వారా మీ చుట్టూ ఉండేవాళ్లు కూడా నవ్వుతూ ఉండేలా చేయొచ్చు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాళ్లలో సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుందని పలు రకాల సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి రోజుకి పది నిముషాలైనా నవ్వడాన్ని అలవాటు చేసుకోవాలి.
Laughing,Health Tips,Health Benefits
laughing, health benefits, health, telugu, telugu news, telugu latest news, telugu global news, latest telugu news, నవ్వు, నవ్వడం, ఆరోగ్యం
https://www.teluguglobal.com//health-life-style/do-you-know-how-many-health-benefits-of-laughing-955293