నాగార్జున గారూ ఎలిమినేట్‌ చేసేయండి సర్‌

 

2024-10-21 04:10:03.0

https://www.teluguglobal.com/h-upload/2024/10/21/1370911-nagamanikanta.webp

బిగ్‌బాస్‌ సీజన్‌-8 లో ఈ వారం సీన్‌ రివర్సైంది. ఆడియన్స్‌ మెచ్చి ఓట్లు వేసినా ఎలిమినేట్‌ అయిన నాగ మణికంఠ

బిగ్‌బాస్‌ సీజన్‌-8 లో ఈ వారం సీన్‌ రివర్సైంది. దూకుడు సినిమాలో బ్రహ్మానందం కొట్టిన ‘నాగార్జున గారూ ఎలిమినేట్‌ చేసేయండి సర్‌’ మాటే కంటెస్టెంట్‌ నాగమణి కంఠకు వర్తించింది. ఆడియన్స్‌ మెచ్చి ఓట్లు వేసినా, వ్యాఖ్యాత నాగార్జున పదే పదే హెచ్చరించినా వినకుండా తనను ఎలిమినేట్‌ చేయాలని అదే పనిగా కోరాడు. ఫలితంగా ఈ వారం నాగ మణికంఠ ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ వారం నామినేషన్స్ లో మణికంఠ, గౌతమ్‌లు చివరి వరకు నిలిచారు.

ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. మణి కంఠ నిర్ణయంపై పునః సమీక్షించుకోవాల్సిందిగా అవకాశం ఇచ్చారు. మనుషులు మూడు రకాలు అంటూ..’కొందరు అసలు మొదలుపెట్టరు.. మరికొందరు ప్రారంభించి ఆపేస్తారు.. ఇంకొందరు తమ లక్ష్యం సాధించే వరకూ వదలరు’ అని మణికంఠలో స్ఫూర్తి నింపడానికి యత్నించారు. అయినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో ఆయన కోరిక మేరకు బిగ్‌బాస్‌ సీజన్‌-8 నుంచి ఎలిమినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆడియన్స్‌ వేసిన ఓట్ల వివరాలను వెల్లడించారు. ఈ వారం ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన గౌతమ్‌ ఎలిమినేట్‌ కావాల్సి ఉండగా.. మణికంఠ కోరడంతో అతడిని ఇంటి నుంచి బైటికి పంపారు. తానొకటి తలిస్తే, దైవమొకటి తలచింది అన్నట్టు మణికంఠ విషయంలో అది రివర్స్‌ అయ్యింది.

 

Bigg Boss Telugu season -8,Week 7,Shocking Elimination,Gautham Krishna