2024-10-23 09:49:57.0
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు నామిషన్ దాఖలు చేశారు.
https://www.teluguglobal.com/h-upload/2024/10/23/1371750-fgtw.webp
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు నామిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ప్రియాంకాగాంధీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకు ముందు వాయనాడ్ నియోజకవర్గం కల్పెట్ట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం కల్పెట్టలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంకాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రసంగించారు.
వాయనాడ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. వాయనాడ్ ప్రజలకు తమ కుంటుంబం రుణపడి ఉన్నదని అన్నారు. కాగా ప్రియాంకాగాంధీ తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగారు. ఆమె ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో కూడా ప్రత్యక్షంగా పోటీపడలేదు. అయితే గత 35 ఏళ్లుగా దేశంలో జరిగిన వివిధ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు తొలిసారి ఆమె తనకోసం తాను ప్రచారం చేసుకోబోతున్నారు. కాగా వాయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.వయనాడ్ లోక్ సభలో ఎలగేన గెలవాలని బీజేపీ భారీ కసరత్తు చేస్తుంది. ప్రియాంక గాంధీ మీదకు పోటీగా తొలుతా నటి ఖుష్బూను బరిలోకి దింపాలని భావించారు. సినీ గ్లామర్ తో పాటు.. ప్రత్యర్దులపై మాటల తూటాలు పేల్చడంలో ఖుష్బూ దిట్టగా పేరుంది.. అయితే కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు.. ఆమె స్థానంలో కేరళ బిజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్ననవ్యా హరిదాస్ ను బరిలోకి దింపాలని బిజేపీ అధిష్టానం డిసైడ్ అయింది
Priyanka Gandhi,Wayanad Lok Sabha by-election,Sonia Gandhi,Rahul Gandhi,AICC,KC Venugopal,CM Revanth Reddy