https://www.teluguglobal.com/h-upload/2024/03/13/500x300_1305900-tongue.webp
2024-03-13 03:14:23.0
నాలుకలో వచ్చే మార్పుల ఆధారంగా మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంటారు.
నాలుకలో వచ్చే మార్పుల ఆధారంగా మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. మన జీవన విధానంలో నాలుకపై పెద్దగా శ్రద్ధ పెట్టం. కానీ ఏదైనా జబ్బు కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు డాక్టర్ మొదట నాలుక చూస్తారు. నాలుకను చూడటం ద్వారా కాలేయం వంటి అనేక వ్యాధుల లక్షణాలు వ్యక్తమవుతాయి. అందుకే వైద్యులు నాలుక రంగును బట్టి శరీర ఆరోగ్యం చెబుతుంటారు.
మనలో చాలా మంది పట్టించుకోకుండా వదిలేసే ఒక శరీర ఒక భాగం నాలుక. మనం కేవలం బ్రష్ చేసేటప్పుడు మాత్రమే నాలుకను క్లీన్ చేస్తాం. అయితే ఆ తర్వాత నాలుక రంగు ఏమైనా మారిందా? ఏవైనా సమస్యలు వచ్చాయా? అని చూడం. కానీ శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే నాలుక కూడా ఎన్నో విధాలుగా ప్రభావితమవుతుంది. మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్నిచూపుతుంది. అసలు డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పడు మన నాలుకను ఎందుకు చూస్తారు? మనకున్న సమస్యలను నాలుక ద్వారా తెలుసుకోవచ్చు. మరి మన నాలుక ఏ రంగులో ఉంటే సమస్యో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నాలుకపై తెల్లని పొర..
మీ నాలుక పైభాగంలో తెల్లటి పొరలాగ కనిపిస్తే మీరు నాలుకను సరిగ్గా క్లీన్ చేయడం లేదని అర్థం. అంటే ఇది మీరు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తుంది. ఇలా నాలుకపై తెల్లని పొర ఉంటే.. మీ నాలుకపై బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయని అర్థం. అయితే ఇది డీహైడ్రేషన్ సమస్య వల్ల కూడా కావచ్చు.

స్ట్రాబెర్రీ టంగ్..
నాలుక గరుకుగా, స్ట్రాబెర్రీల బయట ముళ్లలా సన్నని ముళ్లలాగ కనిపించడాన్నే స్ట్రాబెర్రీ టంగ్ అంటారు. ఇది విటమిన్లు.. ముఖ్యంగా బి విటమిన్లు తగ్గడాన్ని సూచిస్తుంది. ఈ వ్యాధి రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. పిల్లలే ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతుంటారు.

నలుపు రంగు..
కొంతమంది నాలుక నల్లగా కనిపిస్తుంది. నాలుక ఇలా కనిపించిందంటేస్మోకింగ్ చేస్తున్నట్టు. అలాగే కాఫీ లేదా టీ లను ఎక్కువగా తాగినా కూడా ఇలాగే అవుతుంది. అతిగా యాంటీబయాటిక్స్ వాడకాన్ని కూడా ఇది సూచిస్తుంది. ఇక మీ నాలుకపై కొద్దిగా నీలం లేదా ఊదా రంగు కనిపిస్తే.. మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయనడాన్ని సూచిస్తుంది. ఇది గుండె, ఊపిరితిత్తులు వంటి అవయవాలకు సంబంధించిన వ్యాధులను కూడా సూచిస్తుంది.
Tongue Color,Tongue Health,Health
Tongue Color, tongue health,tongue color,health condition from tongue,color of the tongue, health news, telugu news
https://www.teluguglobal.com//health-life-style/tongue-color-how-can-the-problem-be-identified-by-the-color-of-the-tongue-1010097