నా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే రు.500 కోట్లు

2024-11-19 10:02:12.0

https://www.teluguglobal.com/h-upload/2024/11/19/1379098-images.webp

తన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి బీజేపీ రూ. 500 కోట్లు ఖర్చు చేసిందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీకి బుధవారం రెండో విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ పై ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. ప్రజల్లో తనపై విద్వేషాన్ని నింపడమే ద్యేయం గా బీజేపీ పని చేసిందని అన్నారు. ప్రజల మధ్య విద్వేషం రగిలించి లబ్ది పొందాలని చూస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వం పై విష ప్రచారం చేయడానికి 9 వేలకుపైగా కాషాయ పార్టీ ఏర్పాటు చేయించిందని అన్నారు. ఈ గడ్డపై అలాంటి రాజకీయాలకు తావు లేదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొందరిని పిలిపించి తనపై తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఎన్నికల బాండ్లు, నకిలీ మందులు, వ్యాక్సిన్లతో తాము ప్రజలను మోసం చేయలేదని బీజేపీ పై మండిపడ్డారు.

Jharkhand, assembly elections, hemanth doren, bjp