నా కుమారుడికి ఉరి శిక్ష విధించండి..సంజయ్ రాయ్ తల్లి

2025-01-19 12:12:26.0

సుప్రీంకోర్టు తీర్పుపై సంజయ్ రాయ్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

https://www.teluguglobal.com/h-upload/2025/01/19/1395857-sanjay.webp

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కేసులో తన కొడుకును ఉరి తీసినా తనకు అభ్యంతరం లేదని, సంజయ్ చేసిన తప్పును క్షమించరానిదిగా తెలిపింది. తనకూ ఆడపిల్లలు ఉన్నారని, మృతురాలి తల్లి బాధను తాను అర్థం చేసుకోగలను అని అన్నారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయబోమని సంజయ్ కుటుంబ సభ్యులు పేర్కొనడం గమనార్హం.

ఈ ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ ని కోల్ కతా కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అతడికి న్యాయస్థానం రేపు (జనవరి 20) శిక్ష ఖరారు చేయనుంది. మరణించిన ఆ జూనియర్ డాక్టర్ ను కూడా తన కుమార్తెలాగే భావిస్తానని పేర్కొన్నారు. సంజయ్ కి మరణశిక్ష విధించినా తాము ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని, కాకపోతే, కొడుకు చనిపోయినందుకు కన్నీళ్లు పెడతానేమో అని వ్యాఖ్యానించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

Colcutta Trainy Doctor,Sanjay Roy,RG Kar Medical College,Supreme Court,Kolkata Trainee Doctor