2024-10-19 05:14:18.0
https://www.teluguglobal.com/h-upload/2024/10/19/1370400-singer-rahul-sipligunj.webp
రజినీ కాంత్ అభిమానిగా ఇప్పటికీ బాధపడుతుంటానన్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్
నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ‘నాటు నాటు’తో ఆస్కార్‌పై స్టేట్‌పై ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆసక్తిర విశేషాలను పంచుకున్నాడు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో దిగిన ఫొటోకు సంబంధించిన అంశం, ఆ తర్వాత తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపాడు. ఆ ఫొటో నెట్టింట షేర్ చేయడంపై ఇప్పిటికీ తాను బాధపడుతున్నట్లు వాపోయాడు.
రంగమార్తాండ మూవీ షూట్‌తో ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణతో నాను అనుబంధం ఏర్పడింది. ఆ సినిమా షూటింగ్‌లో ఉండగా.. నేను రజనీ సార్‌కు వీరాభిమానని ప్రకాశ్‌రాజ్‌కు తెలిసింది. దాంతో ఆయన నన్ను పిలిచి రేపు తాను రజనీకాంత్ మూవీ షూట్‌కు వెళ్తున్నానని, నన్ను కూడా రమ్మన్నాడు. అలా ‘అన్నాత్తే’ షూట్‌కు వెళ్లాను. రజనీ సార్‌కు నన్ను పరిచయం చేశారు. వెంటనే కాళ్లు మొక్కాను. నా ఇష్టాన్ని గమనించి ఫొటో దిగారు. సినిమాకు సంబంధించి తన లుక్ ఇంకా రిలీజ్ చేయలదని.. కాబట్టి మూవీ విడుదలయ్యేవరకు ఆ ఫొటో ఎక్కడా షేర్ చేయవద్దని చెప్పారు. సుమారు 10 రోజులు గడిచాక ఆనందం తట్టుకోలేక ఒక రోజు ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది నెట్టింట వైరల్ కావడం, హీరో లుక్ బైటికి రావడంతో నిర్మాణ సంస్థ ఆందోళన పడింది. నాకు తెలిసి నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే. ఒక అభిమానిగా ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ తర్వాత దాన్ని డిలీజ్‌చేశాను. అని రాహుల్ సిప్లిగంజ్ తెలిపాడు.
Singer Rahul Sipliganj,Says,Suffers fan of Rajinikanth,Made biggest mistake