నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా

 

2024-12-23 07:33:29.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/23/1388344-rahul-rama-krishna.webp

సంధ్య థియేటర్‌ ఘటనపై పెట్టిన పోస్టును వెన్కక్కి తీసుకుంటున్నట్లు తెలిపిన రాహుల్‌ రామకృష్ణ

పుష్ప2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కొన్నిరోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే.ఈ ఘటనపై అల్లు అర్జున్ ను అరెస్టు చేేసినప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఆయనకు మద్దతుగా పోస్టులు పెట్టారు. ఆ సమయంలోనే కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ కూడా పోలీసుల తీరును ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

సంధ్య థియేటర్‌ వద్ద ఏం జరిగిందో తెలుపుతూ సీపీ సీవీ ఆనంద్‌ తాజాగా వీడియో విడుదల చేశారు. ఆ ప్రెస్‌మీట్‌ తర్వాత రాహుల్‌ రామకృష్ణ పోస్టు పెట్టడంతో అది వైరల్‌గా మారింది. ఆ రోజు జరిగిన ఘటనపై అప్పుడు నాకు సరిగ్గా సమాచారం లేదు. ఆ రోజు చేసిన వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నా అని రాహుల్‌ అన్నారు.

రాహుల్‌ రామకృష్ణ ఆరోజు ఏమన్నారంటే

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన సంఘటన దురదృష్టకరం. కానీ లా అండ్‌ ఆర్డర్‌ వైఫల్యం.. ఒక వ్యక్తి చేసిన తప్పు ఎలా అవుతుంది? పబ్లిక్‌ ప్లేస్‌లకు సెలబ్రిటీలు హాజరయ్యేటప్పుడు పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలి. సినిమా స్థాయిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎక్కువమంది ప్రజలు వస్తారని తెలిసినప్పుడు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు. అంతమందిని లోపలికి ఒకేసారి ఎందుకు అనుమతించారు? మతపరమైన ఊరేగింపులు, రాజకీయపార్టీల మీటింగ్‌ సమయాల్లో జరిగే తొక్కిసలాటల్లోనూ కొన్నిసార్లు ప్రజలు మరణిస్తారు. అలాంటివారికి ఇంత వేగంగా ఎందుకు స్పందించరు? సినిమా విషయంలో ఇంత వేగంగా ఎందుకు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందేలా చూడాలి. వారి నష్టాన్ని భర్తీ చేయలేం. ఇలాంటి ఘటనల్లో ఒక్కరినే బాధ్యులను చేయడం సరికాదని పేర్కొన్నారు. 

 

Sandhya Theater Stampede Incident,Rahul Ramakrishna,Retracts,Comments on Issue,City Police Commissioner CV Anand