నిఖత్‌ జరీన్‌కు 2 కోట్ల చెక్ ఇచ్చిన కేసీఆర్

2022-06-02 00:00:02.0

విమర్షకుల అందరి నోళ్ళను మూయించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కిన్నెరమెట్ల వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల చెక్, అంతర్జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్ లకు 2 కోట్ల రూపాయల చొప్పున చెక్ అందజేశారు ముఖ్యమంత్రి. పబ్లిక్ గార్డెన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి, కిన్నెరమెట్ల వాయిద్యకారుడు, పద్మశ్రీ మొగులయ్య, అంతర్జాతీయ […]

విమర్షకుల అందరి నోళ్ళను మూయించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కిన్నెరమెట్ల వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల చెక్, అంతర్జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్ లకు 2 కోట్ల రూపాయల చొప్పున చెక్ అందజేశారు ముఖ్యమంత్రి.

పబ్లిక్ గార్డెన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి, కిన్నెరమెట్ల వాయిద్యకారుడు, పద్మశ్రీ మొగులయ్య, అంతర్జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్ లను ఘనంగా సత్కరించారు. నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్ లకు నగదు బహుమతి తో పాటు బంజారాహిల్స్ లో నివాస స్థలాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

మొగులయ్యకు కోటి రూపాయలు ఇవ్వరని, ఆయనకు ప్రభుత్వం మొండి చేయి చూపించని బీజేపీ చేసిన ప్రచారానికి ఇవ్వాల్టితో తెరపడినట్టే. అలాగే క్రీడాకారిణి నిఖత్‌ జరీన్ కు నగదు బహుమతి విషయంలో కూడా కొన్ని వర్గాలు విమర్షలు గుప్పించాయి.

ఎవరెన్ని విమర్షలు చేసినా తెలంగాణ కళాకారులు, క్రీడాకారులకు అండగా నిలబడింది తెలంగాణ ప్రభుత్వం

 

Champion Nikhat Zareen,isha singh,KCR,mogulayya,Telangana