2025-03-11 13:32:11.0
హైదరాబాద్ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎంజీఐటీ కాలేజీ ఇంజినీరింగ్ విద్యార్థులు ఆరుగురు కారులో నార్సింగి నుంచి నియోపొలిస్ వైపు వెళ్తుండగా నియో పోలీసు సమీపంలోని మూవీ టవర్ వద్ద కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న శ్రీకర్ అక్కడికక్కడే మృతి చెందగా, హేమసాయి, వివేక్, సుజన్, కార్తికేయ, హర్షకు తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. వేగంగా స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. క్షతగాత్రులను సమీపంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Road accident,Hyderabad Movie Towers,MGIT students,Neo Police,Narsinghi,Srikar,Continental Hospital,Movie Tower,Crime news