నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్‌

2025-02-10 05:28:02.0

జీహెచ్‌ఎంసీలో బీజేపీ మేయర్‌ వచ్చేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు కిషన్‌ రెడ్డి పిలుపు

కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చి హామీలను గాలికి వదిలేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా లంకల దీపక్‌ రెడ్డి బాధ్యతల సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ నుంచి బర్కత్‌పురాలోని బీజేపీ కార్యాలయం వరకు బాండ్‌ మేళాలతో సాగిన ప్రదర్శనలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కుటుంబ పాలన సాగిందని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అహంకారపూరితమైన మజ్లిస్‌ పార్టీ కోరలు పీకి ఇక్కడ కాషాయ జెండా ఎగరవేయాలన్నారు. దానికి మనమంతా సిద్ధంగా ఉండాలన్నారు.

Central Minister Kishan Reddy,Fire On Revanth Govt,On Unemployment issues,GHMC Elections,BJP