నిలదీసే దమ్ము ఎక్కడ (కవిత)

2023-05-28 10:16:17.0

https://www.teluguglobal.com/h-upload/2023/05/28/772051-bala.webp

అందమైన రంగులద్దిన

మబ్బు తునకల ప్రతిబింబాలు..ఒకవైపున

కర్మాగార విసర్జిత కలుషిత

నురగలు మరోవైపున..

స్వార్థ రాజకీయ గాంధారుల

నిర్వాకం…

అమాయక జనుల ఆక్రందనం

అడవి రోదన..

ఓట్లు..అమ్ముడయినంత కాలం

ఎవరూ..చలించని దౌర్భాగ్యపు జీవనం..సాగుతూనే ఉంటుంది..

నిలదీయాల్సిన వారి ఓటు…

కరెన్సీనోటుకి..

నోటి..లో ముక్క కి

గొంతులో చుక్కకి..

అమ్ముడుపోతున్నంతకాలం …

స్వచ్చమైన కాసారాలు

దుర్గంధనిలయాలే

మరి..మొహం చాటేసుకుని

ముక్కులు మూసుకొని..వెళ్లి పోవడాలే..

అమ్ముడయిన వారికి నిలదీసే

దమ్ము ఎక్కడిదీ?

– పి బాలా త్రిపుర సుందరి

P Bala Tripura Sundari,Telugu Kavithalu