https://www.teluguglobal.com/h-upload/2024/10/11/500x300_1368182-nihan-hindankyo-nobel-peace.webpNaveen Kamera
అన్వాయుధాలు లేని ప్రపంచం కోసం పని చేస్తున్న సంస్థ
హిరోషిమా, నాగసాకి పై ప్రయోగించిన అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయట పడిన వారికి సేవలందిస్తున్న, అన్వాయుధాలు లేని ప్రపంచం కోసం పరితపిస్తున్న జపాన్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ నిహాన్ హిడాంకియోకు 2024 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. ఈమేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది. నిహాన్ హిడాంకియోను హిబాకుషా అని కూడా పిలుస్తారు. హిరోషిమా, నాగసాకిపై రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు ప్రయోగించడంతో ఆ రెండు నగరాలు సర్వస్వం తుడిచి పెట్టుకుపోయాయి. పెద్ద సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొందరు ప్రాణాలతో బతికి పడినా అణుబాంబు ప్రభావంతో జీవశ్చవాల మాదిరి బతుకులు వెళ్లదీశారు. తాము అనుభవిస్తున్న చిత్రవధ ఇంకెవ్వరూ అనుభవించకుండా ఉండాలంటే ప్రపంచంలో ఇంకెక్కడా అణుదాడి జరగకూడదని బాధితుల వీడియోలతో నిహాన్ హిడాంకియో ప్రచారం చేస్తోంది. నిహాన్ హిడాంకియోను 1956లో స్థాపించారు. 1945లో అణుబాంబు దాడిలో బతికి బయట పడ్డవారికి ఆ సంస్థ ఆధ్వర్యంలో సేవలందించారు.
Nihon Hidankyo,Nobel Peace Prize,Japanese organisation,atom bomb,Hiroshima,Nagasaki,survivors,nuclear weapon free worldhttps://www.teluguglobal.com//news/international/nobel-peace-prize-to-the-japanese-organisation-nihon-hidankyo-1070778