2022-12-16 10:11:14.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/16/431504-nethi.webp
కం:
అయగారికసలు చదువే
మియు రాదిక వేష మేమొ
మిట మిట మన్ వి స్మయమౌను
“పటాటోప భయంకర ” యటన్న సరణి బరగును నరుడా !!
కం:
పలు పలుకు లేలరా ?
ని ర్మల మతి నూహించ ” దనకు మాలిన ధర్మం బిల గలదె ?”
దినము గడచుటె
తల పట్టుట , లేరుగ
నట్టిదా ? మరి నరుడా !!
కం:
నలుగురు నడచెడి దారినె
మెలగుట , కడు లెస్స యొంటి మెలగిన ఫలముల్గలుగవు
” సంఘే శక్తిః కలౌ యుగే ”
యనెడి సూక్తి గట్టిది నరుడా !!
కం:
పని పాట లేక యూరక
తిని దిరిగెడి నాప చెంత
దిరిగెడి వారిన్ జెనకుడు
దాజెడు కోతియు
వన మెల్లంజెరచు నట్టి పట్టుగ నరుడా !!
కం:
మతి మంతుడైన యాతడు
ధృతి మన్మని యౌచు
” మాతృ దేవోభవ ” యన్
వ్రతము ” సమాతుః పరదై
వత ” మని ఎడినుడి నెరింగి
వర్థిలు నరుడా!!
కం:
ఒకనికి గలదని యేడ్చిన
ఒక కన్ను నశించు
దనకు నుండదె యంచున్
వికట గతి నేడ్వగా నిం
కొక కన్నుంబోవు నట్టు
లొనరకు నరుడా!!
కం:
స్వాంతమున దనకు దోచిన
యంతగ నెరవెర్చుకొనుట హాయి గదా? కాకెంతయు
” స్త్రీ బుద్దిః ప్రళ యాంతక ”
మని వినియు జొరుట
హానిర నరుడా!!
కం:
తనకు గల సంశయమునే
యనుమానము లేక తేల్చి అడుగుట ఎంతో ఘన ” మంత్య నిష్టుర ము
కన్నను నాదిని నిష్టురమ్మె
నయముర నరుడా!!
కం:
ఆలించు ” కాముకస్య కు
తో లజ్జా” యనెడు మాట తోచియు స్వేచ్ఛాలీల జన వలదు కాలమె
గాలమ్మగు నమ్ముమొక్కకడ నో నరుడా!!
కం:
దోసరుల చెలిమి బూనకు
వీసంబును వారు చిక్కు వెట్టెదరెపుడున్
” కూసెడి గాడిద వచ్చియు
మేసెడి గాడిదను జెరచు ” మేలుగ నరుడా!!
-శశిశర్మ బొల్లాప్రగడ (విశాఖపట్టణం)
Shashi Sharma Bollapragada,Telugu Kathalu