2022-07-07 00:05:18.0
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ట్రోలర్లకు చిక్కారు. తనను తాను నిత్యం ప్రమోట్ చేసుకునే చంద్రబాబు.. గొప్పలు చెప్పుకుంటూ ఇప్పటికే చాలా అలుసైపోయారు. అయినా సరే.. తన ధోరణిలో తాను వెళ్తూనే ఉంటారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా.. అబద్దాలు చెప్తూ, తప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆ మధ్య బిల్‌గేట్స్, తనకు మధ్య కంప్యూటర్ గురించి వచ్చిన చర్చను చెప్పారు. ఇద్దరం కంప్యూటర్ ముందు కూర్చొని బటన్ నొక్కితే.. అది […]
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ట్రోలర్లకు చిక్కారు. తనను తాను నిత్యం ప్రమోట్ చేసుకునే చంద్రబాబు.. గొప్పలు చెప్పుకుంటూ ఇప్పటికే చాలా అలుసైపోయారు. అయినా సరే.. తన ధోరణిలో తాను వెళ్తూనే ఉంటారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా.. అబద్దాలు చెప్తూ, తప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆ మధ్య బిల్‌గేట్స్, తనకు మధ్య కంప్యూటర్ గురించి వచ్చిన చర్చను చెప్పారు. ఇద్దరం కంప్యూటర్ ముందు కూర్చొని బటన్ నొక్కితే.. అది పని చేయలేదని.. ఈ కంప్యూటర్లు అవసరం అయినప్పుడు పని చేయవని బిల్‌గేట్స్ తనతో అన్నట్లు చెప్పుకొచ్చారు. ఏదో ప్రోగ్రామ్ పాడైపోయి ఉంటదని కవర్ చేసినట్లు బాబు బడాయిగా చెప్పుకున్నారు.
ఈ విషయంలో సోషల్ మీడియాలో వీడియోతో సహా పెట్టి తీవ్రంగా ట్రోల్ చేశారు. బిల్‌గేట్స్‌కే కంప్యూటర్ గురించి నేర్పేంత పెద్దవాడినని ఎలా నిస్సిగ్గుగా ప్రొజెక్ట్ చేసుకుంటారని ప్రశ్నించారు. తాజాగా ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డి కూతుర్లను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రజలను ఆశ్చర్యపరిచాయి. చిత్తూరు జిల్లా మదనపల్లెల్లో మినీ మహానాడు నిర్వహించారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
‘పేద పిల్లలు బాగా చదువుకోవాలని టీడీపీ పార్టీ కోరుకుంటుంది. తన హయాంలో ప్రతీ గ్రామంలో పాఠశాలలు కట్టించాము. ఇప్పుడేమో అమ్మఒడికి ఆంక్షలు పెట్టి తల్లులను మోసం చేస్తున్నారు. నీ (జగన్) కూతుర్లలో ఒకరేమో పారిస్‌లో చదవాలి, ఇంకొకరు లండన్‌లో చదవాలి. మన పిల్లలేమో వాగులు, వంకలు దాటి వెళ్లాలా. అన్నింటికీ చిత్రగుప్తుడిలా లెక్కలు రాస్తున్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటికీ తిరిగి చెల్లిస్తాం’ అని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై వైసీపీ ఇంకా స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చంద్రబాబును తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
గతంలో నీ కొడుకు లోకేశ్, కోడలు బ్రాహ్మణి ఎక్కడ చదువుకున్నారో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసంటూ మండిపడ్డారు. తాను వాళ్లను విదేశాల్లో చదివిస్తే ఓకే.. కానీ జగన్ తన కూతుర్లను విదేశాల్లో చదివిస్తే మాత్రం పెద్ద తప్పా అంటూ ప్రశ్నించారు. నారా లోకేశ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్, మెల్లాన్ యూనివర్సిటీలో పీజీ చేసిన విషయం అందరికీ తెలుసు, దానికి స్పాన్సర్ చేసిన వ్యక్తి ఎవరో ప్రపంచానికి తెలుసంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నారా బ్రాహ్మణి శాంటా క్లారా యూనివర్సిటీ, ది లీలాండ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నది అబద్దమా అని ప్రశ్నిస్తున్నారు.
గతంలో ఏ సీఎం, ప్రభుత్వం కేటాయించినన్ని నిధులు విద్యారంగానికి సీఎం జగన్ కేటాయిస్తున్నారని, నాడు-నేడు పేరుతో పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారనే విషయం తెలియదా అని అంటున్నారు. విద్యా కానుక పేరుతో కిట్లు, అమ్మ ఒడి పేరుతో నేరుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం నిజం కాదా అని నిలదీస్తున్నారు. చంద్రబాబుకు అన్ని విషయాలు తెలిసినా ఏదో ఒక రకంగా బురద జల్లేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
రాజకీయాలకు సంబంధం లేకుండా, కనీసం బయట ప్రచారం లేకుండా తన పిల్లలను చదివించుకుంటుంటే.. ఇలాంటి దుర్మార్గమైన విమర్శలు చేయడం భావ్యం కాదని అంటున్నారు. చంద్రబాబు ఇలాగే మాట్లాడితే.. తన కొడుకు గురించి కూడా ఇంకా లోతైన విషయాలు బయటపెడతామని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా.. జగన్ కూతుర్లను టార్గెట్ చేయడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా చంద్రబాబును ఆడుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Chandrababu,English Mediam,satires,Social Media