2024-10-06 06:44:26.0
https://www.teluguglobal.com/h-upload/2024/10/06/1366635-prakashraj.webp
ప్రకాశ్ రాజ్ కు ఆయన స్టైల్ లో ట్వీట్ చేసిన ప్రొడ్యూసర్
తిరుమల లడ్డూ వివాదం తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వరుస ట్వీట్ లతో విరుచుకు పడుతున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కు ఆయన స్టైల్ లోనే కౌంటర్ ఎదురయ్యింది. ప్రముఖ రచయిత, డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ రచించిన ఐదు పుస్తకాలను శనివారం చెన్నైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో పాటు ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. వారితో కలిసి వేదిక పంచుకున్న ఫొటోను ప్రకాశ్ రాజ్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ”విత్ ఏ డిప్యూటీ సీఎం.. జస్ట్ ఆస్కింగ్ అని కామెంట్ చేశారు. ఈ ట్వీట్ కు తమిళ నిర్మాత వినోద్ కుమార్ స్పందించారు. వేదికపై నీ పక్కన కూర్చున్న వాళ్లు ఎన్నికల్లో గెలిచారు.. నీవు డిపాజిట్లు కోల్పోయావు.. అదే మీ మధ్య ఉన్న వ్యత్యాసం అని కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా ఎవరికి చెప్పకుండా కారవ్యాన్ నుంచి ఎక్కడికో వెళ్లిపోయి రూ.కోటి నష్టం వచ్చేలా చేశావు.. అలా చేయడానికి కారణం ఏమిటి.. జస్ట్ ఆస్కింగ్ అని ప్రశ్నించారు. అక్కడి నుంచి వెళ్లిపోవడానికి కారణాలను ఫోన్ చేసి వివరిస్తానని చెప్పావని.. అసలు నీ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పైనా జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాశ్ రాజ్ కు ఆయన స్టైల్ లోనే కౌంటర్ ఇవ్వడం విశేషం.
Prakash Raj,Producer Vinod Kumar,Just Asking,Tamilanadu CM Stalin,Deputy CM Udayanidhi Stalin,MP Thiruchi Shiva