“నీ హృదయంలో నిదురించే…నా ఊహవే నీవు!”

2023-03-06 11:49:57.0

https://www.teluguglobal.com/h-upload/2023/03/06/725823-heart.webp

నీ చుట్టూ వెలుగునై

నీ లోపలి ప్రేమ వెల్లువ వలె,

నీ గళంలో సాగే పాటనై

నీ మోవిపైన పలికే రాగమై

నీ మురళిలో మ్రోగే గానమై

సదా నీ హృదిలో మధురంగా

ధ్వనియించే ప్రణయరసధునినై

నీ బాహువులలో మైమరచే

నీ జీవనవాహినినై, సహచరినై

నీ ప్రేమానురాగాల మోహినియై,

నీవెవరో నేనెవరో తెలియని

అగోచర దృగాంచల సన్నిభమై

నీలోనే నిమగ్నమై

నిరతరం నీ తలపులలో

కృష్ణా నీ సన్నిధిలో నేను

– రాచకొండ ఉమ( USA)

Rachakonda Uma,Telugu Kavithalu