2016-03-15 07:02:04.0
పుర్రెకో బుద్ది…జిహ్వకో రుచి అన్నారు. అలాగే నుదుటికో భిన్నమైన బొట్టు… కూడా అనాల్సిందే. ఎందుకంటే అన్ని విభిన్నమైన బొట్టుబిళ్లలను సృష్టించింది బుక్‌మైబిందీ డాట్ కామ్ వైబ్‌సైట్. వెండి, బంగారం, ప్లాటినం, ముత్యాలు, మెరుపులు ఇవన్నీమామూలే. వీటిని వాడటంతో పాటు, పలురకాల డిజైన్లతో బొట్టుబిళ్లలను తయారుచేస్తున్నారు ఈ పోర్టల్ నిర్వాహకులు. పూలు, పళ్లు, కాయలు, గళ్లు, గీతలు, జామెట్రీ డిజైన్లు..ఇలాంటి 15వందల రకాల డిజైన్లలో బిందీలు ఇక్కడ దొరుకుతున్నాయి. సాంప్రదాయ దుస్తులమీదే బొట్టు పెట్టుకోవాలి అనుకునేవారి నమ్మకాన్ని బ్రేక్ […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/03/women-2.gif
పుర్రెకో బుద్ది…జిహ్వకో రుచి అన్నారు. అలాగే నుదుటికో భిన్నమైన బొట్టు… కూడా అనాల్సిందే. ఎందుకంటే అన్ని విభిన్నమైన బొట్టుబిళ్లలను సృష్టించింది బుక్‌మైబిందీ డాట్ కామ్ వైబ్‌సైట్. వెండి, బంగారం, ప్లాటినం, ముత్యాలు, మెరుపులు ఇవన్నీమామూలే. వీటిని వాడటంతో పాటు, పలురకాల డిజైన్లతో బొట్టుబిళ్లలను తయారుచేస్తున్నారు ఈ పోర్టల్ నిర్వాహకులు. పూలు, పళ్లు, కాయలు, గళ్లు, గీతలు, జామెట్రీ డిజైన్లు..ఇలాంటి 15వందల రకాల డిజైన్లలో బిందీలు ఇక్కడ దొరుకుతున్నాయి. సాంప్రదాయ దుస్తులమీదే బొట్టు పెట్టుకోవాలి అనుకునేవారి నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ, ఇక్కడ బికినీమీద ధరించే బొట్టుబిళ్లలు కూడా రూపొందించారు. దీని వ్యవస్థాపకుల్లో ప్రభలీన్ కౌర్ అనే టివి నటి, అరూనా భట్ అనే ఇమేజ్ కన్సల్టెంట్ ఉన్నారు.
అరూనా భట్ చేత్తో తయారుచేసిన బిందీలను ఎక్కువ మొత్తంలో కలెక్ట్‌చేసిన మహిళగా లిమ్కా బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కారు. అవన్నీ ఆమె తయారుచేసినవే. ఒక్కో బిందీ తయారికీ ఆమెకు కేవలం ఒక్క నిముషంకంటే తక్కువ సమయమే పడుతుంది. ఒకసారి చేసిన డిజైన్‌ని మళ్లీ తిరిగి రిపీట్ చేయరు.
గత ఏడాది అక్టోబరులో ఈ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు. వినియోగదారులకు ఎలాంటి బిందీ కావాలో అడిగి వారి అభిరుచి మేరకు తయారుచేసి ఇస్తారు. బొట్టులేకుండా బయటకు వెళ్లటం కుదరని సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన భట్ రోజూ ఒకే రకం బొట్టు బిళ్లలు వాడి బోరనిపించి వినూత్న ప్రయత్నాలు చేశారు. ద్రవరూపంలో ఉన్న రంగులు, లిప్‌స్టిక్, ఐ లైనర్, ఇలా ఏది కనబడితే దాంతో బొట్టుబిళ్లలు తయారుచేయడం అలవాటు చేసుకున్నారామె. ఆ అభిరుచే ఈ వెబ్‌సైట్‌గా రూపాంతరం చెందింది. ప్రతిరోజూ నిత్యజీవితంలో తారసపడే ఎన్నో అంశాలనుండి తాను స్ఫూర్తిని పొంది బిందీలు తయారుచేస్తానని భట్ చెబుతున్నారు. 199 రూపాయల నుండి ఒక్కో బిందీ స్ట్రిప్ ధర మొదలవుతుంది.
Bindi Designs,Bindi Different Designs