నుమాయిష్‌లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 247 మంది అరెస్ట్‌

2025-02-21 06:25:51.0

పట్టుబడిన 247 మందిలో 223 మంది పెద్దవారు, 24 మంది మైనర్లు ఉన్నారని పోలీసు శాఖ ప్రకటన విడుదల

నాంపల్లి ఎగ్జిబిషన్‌ (నుమాయిష్‌-2025) సమయంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 247 మంది నిందితులను ‘షీ టీమ్స్‌’ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మహిళల భద్రత డీసీపీ తెలిపారు. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 17 వరకు కొనసాగిన నుమాయిష్‌లో మొత్తంగా 37 కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఇద్దరు నిందితులకు 2 రోజుల జైలు శిక్ష, 33మందికి రూ. 1,050 చొప్పున జరిమానా విధించినట్లు వెల్లడించారు నిందితుల్లో 190 మందిని హెచ్చరికతో వదిలిపెట్టామని పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 20 కేసులో విచారణ స్థాయిలో ఉన్నాయన్నారు. పట్టుబడిన 247 మందిలో 223 మంది పెద్దవారు, 24 మంది మైనర్లు ఉన్నారని చెప్పారు. ఈ మేరకు పోలీసు శాఖ ప్రకటన విడుదల చేసింది. 

247 offenders caught,Harassing women. During Numaish,Hyderabad City Police SHE Teams,Nampally Exhibition 2025