2022-06-15 02:34:16.0
చట్ట సభల్లో ఉన్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు బహిరంగ వేదికలపై గార్ధభ సంవాదం చేసుకున్నారు. ఒక సభలో ఒకరు గాడిద అంటే, ఆ వెంటనే మరో సభలో మరొకరు నువ్వే గాడిద అంటూ బదులు తీర్చుకున్నారు. ఈ సంవాదం కోనసీమ జిల్లా మండపేటలో జరిగింది. మండపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు.. రైతు పంటల బీమా కార్యక్రమంలో అధికార పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. రైతుల పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నా, రైతు సమస్యలు మాత్రం గాలికి వదిలేశారని, […]
చట్ట సభల్లో ఉన్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు బహిరంగ వేదికలపై గార్ధభ సంవాదం చేసుకున్నారు. ఒక సభలో ఒకరు గాడిద అంటే, ఆ వెంటనే మరో సభలో మరొకరు నువ్వే గాడిద అంటూ బదులు తీర్చుకున్నారు. ఈ సంవాదం కోనసీమ జిల్లా మండపేటలో జరిగింది. మండపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు.. రైతు పంటల బీమా కార్యక్రమంలో అధికార పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. రైతుల పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నా, రైతు సమస్యలు మాత్రం గాలికి వదిలేశారని, అసలు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్సీ.. గాడిదలు కాస్తున్నారా అంటూ మండిపడ్డారు. వేదికపై ఎమ్మెల్సీ సహా ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కూడా ఉన్నారు. ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. అయితే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అక్కడ సంయమనం పాటించారు. టైమ్ చూసి వేగుళ్లకు షాకిచ్చారు.
ఆ తర్వాత వెంటనే మరో సభ జరిగింది. ఆ వేదికపై కలెక్టర్ హిమాన్షు శుక్లా సహా, ఎమ్మెల్యే కూడా ఆశీనులై ఉన్నారు. ఇక్కడ మైకందుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.. ఎమ్మెల్యే గాడిద గారికి స్వాగతం అంటూ హేళన చేశారు. అక్కడ ఎమ్మెల్యే పరోక్షంగా గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు, ఇక్కడ ఎమ్మెల్సీ నేరుగా ఎమ్మెల్యే గాడిద అంటూ సంబోధించారు. దీంతో ఎమ్మెల్యే వేగుళ్ల చిన్నబుచ్చుకున్నారు.
మండపేట నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన పిల్లి సుభాష్ చంద్రబోస్ పై గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.. నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో తోట వర్సెస్ వేగుళ్ల.. అన్నట్టుగా పొలిటికల్ సీన్ మారిపోయింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ విమర్శలు మరీ శృతి మించాయి. ఒకరినొకరు బహిరంగ వేదికలపైనే గాడిద అంటూ సంబోధించుకోవడం ఈ విమర్శలకు పరాకాష్టగా మారింది.
Mandapeta constituency,TDP MLA,thota trimurthulu,Vegulla Jogeshwara Rao,vs,YCP MLC