నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా నేను ప్రశ్నించడం ఆపను

https://www.teluguglobal.com/h-upload/2024/12/03/1382991-harish-revanth.webp

2024-12-03 10:02:56.0

మాజీ మంత్రి హరీశ్‌ రావు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై కేసు నమోదు కావడంతో ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పందించారు. తనపై లక్ష తప్పుడు కేసులు పెట్టించినా ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపబోనని తేల్చిచెప్పారు. ”మిస్టర్ రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు.. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం.. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించావు.. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించావు.. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్ లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించావు.. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డు మీద ఈకలు పీకి, తలాతోక లేని కేసొకటి మానకొండూరులో పెట్టించావు.. నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్ లో మరో తప్పుడు కేసు పెట్టించావు.. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా.. నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను..” అని హెచ్చరించారు.

Harish Rao,Phone Taping Case,Revanth Reddy,Congress Promises,Six Guarantees,Loan Waiver