2022-11-29 09:05:50.0
https://www.teluguglobal.com/h-upload/2022/11/29/428606-nuvvu.webp
నువ్వు
నువ్వంటే నువ్వే
నీలో ద్వంద్వార్ధాలు ఇక లేవు
విధవనో, వేశ్యనో,పతితనో
ఇంతవరకు నిన్ను చూపిన
ఆనవాళ్లను చెరిపేయాలి నువ్వు
తాళిబొట్టో,హిజాబో ఏదైనా సరే
నిన్ను బంధించే పంజరాలను
ఇక బద్దలు కొట్టాలి నువ్వు
ఆత్మాభిమానం నీ ఆయుధం
మనో నిబ్బరం నీ ఆత్మబలం
ఆత్మరక్షణ నీ ప్రాచీన హక్కు
నువ్వు చల్లగా దీవించే తల్లివి
మమతలు పంచే చెల్లివి
అనురాగపు విత్తనాలు చల్లి
ప్రేమను పండించే నెలతవి
నీ మానప్రాణాలను హరించే
దుష్టశక్తులను అంతమొందించే
మృత్యుదాతవు కూడా ఇక నువ్వే..
నువ్వెప్పుడూ నువ్వే ఇక..
– వంజారి రోహిణి (హైదరాబాద్)
Vanjari Rohini,Hyderabad,Telugu Kathalu,Telugu Kavithalu