https://www.teluguglobal.com/h-upload/2024/07/17/500x300_1344972-weight-loss.webp
2024-07-17 08:17:05.0
ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వీళ్లలో చాలామంది వేగంగా వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలా త్వరగా బరువు తగ్గడం వల్ల కొత్త సమస్యలు కొన్ని తెచ్చుకున్నట్టే అని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వీళ్లలో చాలామంది వేగంగా వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలా త్వరగా బరువు తగ్గడం వల్ల కొత్త సమస్యలు కొన్ని తెచ్చుకున్నట్టే అని డాక్టర్లు సూచిస్తున్నారు. అసలు నెలకు ఎంత బరువు తగ్గితే మంచిదంటే..
బరువు పెరగడం అనేది ఒక్క రోజులో జరగదు. ఆహారపు అలవాట్లను బట్టి మెల్లగా బరువు పెరుగుతుంటుంది. కాబట్టి బరువు తగ్గడం కూడా అంతే మెల్లగా జరగాలంటున్నారు డాక్టర్లు. ఉన్నట్టుండి సన్నగా అయిపోవాలని కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. బరువు తగ్గే ప్లాన్ ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ప్రకారం వారానికి 500 గ్రాములు అంటే అరకిలో బరువు తగ్గడం సేఫ్ ఆప్షన్. అంటే నెలకు రెండు కిలోల బరువు తగ్గేలా డైట్, వర్కవుట్స్ ప్లాన్ చేసుకోవాలన్న మాట. ఇంతకంటే ఎక్కువ బరువు తగ్గించాలని చూస్తే లేనిపోని సమస్యలొస్తాయి.
డైట్ ఇలా..
బరువు తగ్గాలనుకునేవాళ్లు ముందు డైట్‌తో మొదలుపెట్టాలి. హై క్యాలరీ ఫుడ్స్ మానేసి పండ్లు, కూరగాయలు, నట్స్ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. డైటరీ ఫైబర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. మరీ పస్తులుండకుండా కనీసం రోజుకి వెయ్యి క్యాలరీలు అయినా తీసుకోవాలి. ఇలా కొంత కాలం చేసి ఆపైన క్రమంగా వ్యాయామం మొదలు పెట్టాలి.
వ్యాయామం చేసేటప్పుడు ముందు వాకింగ్‌తో మొదలుపెట్టి ఆ తర్వాత ట్రెడ్‌మిల్, జాగింగ్, జిమ్ వంటివి ఎంచుకోవచ్చు. వ్యాయామం చేసే ముందు, తర్వాత పండ్ల రసాలు తీసుకుంటే శరీరం అలసిపోకుండా ఉంటుంది.
నెలకు రెండు కిలోలకు మించి బరువు తగ్గాలని చూస్తే రక్త ప్రసరణ, గుండెపై అదనపు భారం పడే ప్రమాదముంటుంది. కాబట్టి బరువు తగ్గే విషయంలో సహనం ఉండాలి. ముఖ్యంగా వయసుపైబడినవాళ్లు వ్యాయామాల విషయంలో జాగ్రత్త వహించాలి.
ఇకపోతే డయాబెటిస్, బీపీ, కీళ్ల సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ల సలహా మేరకు వ్యాయామాలు చేస్తే మంచిది. శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా బరువు తగ్గుతారు. కాబట్టి దానికనుగుణంగా డైట్ ప్లాన్ చేసుకోవాలి.
Weight Loss,Health Tips,Food
weight, Weight loss, telugu news, telugu global news, health tips, health news
https://www.teluguglobal.com//health-life-style/how-much-weight-can-you-lose-in-a-month-and-still-be-healthy-1049559