నెహ్రూ జూపార్క్‌లో టికెట్‌ ధరలు పెంపు ఎంతో తెలుసా?

2025-02-25 14:53:28.0

బహదూర్‌పూరాలోని నెహ్రూ జూపార్క్‌లో టికెట్‌ రేట్లు పెరగనున్నాయి.

హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌ టికెట్‌ ఎంట్రీ ధర పెంచినట్లు క్యూరేటర్ తెలిపారు. ఈమేరకు పార్క్‌లో జరిగిన జూస్‌ అండ్‌ పార్క్స్‌ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్‌ బాడీలో విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పెంచిన కొత్త రేట్లు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని నెహ్రూ జూపార్క్‌ క్యూరేటర్‌ జె.వసంత వెల్లడించారు. జూపార్క్‌ ఎంట్రీ ఫీజు చిన్నారులకు రూ.50 పెద్దలకు రూ.100 చొప్పున టికెట్ రేట్లు నిర్ణయించారు.

సఫారీ పార్కు డ్రైవ్ సీఎన్‌జీ బస్ 20 నిమిషాలకు ఏసీ రూ.150, నాన్ ఏసీ రూ.100 చొప్పున వసూలు చేస్తారు. 11 సీట్లు గల న్యూ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్‌లో 60 నిమిషాలపాటు షికారు చేస్తే రూ.3,000, 14 సీట్ల బీఓవీ ఎక్స్‌క్లూజివ్ వాహనంలో కలియ తిరిగితే రూ.4,000 వసూలు చేయనున్నారు. అలాగే, జూ పార్కు సందర్శించేందుకు తీసుకొచ్చే వాహనాలు పార్కింగ్ సంబంధించి సైకిల్‌కు రూ.10, బైక్ రూ.30, ఆటో రూ.80, కారు లేదా జీప్ రూ.100, టెంపో లేదా తూఫాన్‌ వాహనం రూ.150, 21 సీట్లు గల మినీ బస్ రూ.200,.. 21 సీట్లు పైగా ఉన్న బస్‌ రూ.300 చొప్పున ధర నిర్ణయించినట్లు క్యూరేటర్ తెలిపారు. 

Nehru Zoo Park,Hyderabad,Curator J. Vasantha,Zoo Park Entry Fee,Telangana News,Hyderabad News,CM Revanth reddy,Telangana tourism,Minister Jupally krishna rao