2023-08-04 18:48:25.0
https://www.teluguglobal.com/h-upload/2023/08/04/805357-youth.webp
సైకిలుని చూడరు
ప్రమాదమైనా బైకులకు బ్రహ్మరధం
కానరాని ఆట స్థలం
చరవాణిలో ప్రత్యక్షం.
అమ్మ నాన్నలను పట్టించుకోని నైజం.
విడుదలైన హీరో కట్ ఔట్ కు పాలాభిషేకం
రోడ్ న పడిపోతున్న అవ్వను
చూడని కన్నులు
నిలుచున్న
అమ్మాయిల వెంట
చూపుల పరుగులు.
పుస్తకాలు తాకేది లేదు.
మొబైల్ ను వదిలే
ప్రసక్తి లేదు.
ఉద్యోగం వచ్చాక
‘అబ్రాడ్” వెళ్ళడం.
ఇండియానే మరవడం
హలో మమ్మీ, డాడి,
అంకుల్, ఆంటి
అనే పిలుపులు
తెలుగు పిలుపులు వినబడదాయే
అంతర్జాలంలో
పలుకరింపుల వేళ
చేతి వ్రాతలే చెరిగి పోయెను.
మనిషి అందక
మాయ మయ్యేను
నేటి యువత
-ఆసూరి ఉషారాణి (తిరుపతి)
Asuri Usharani,Neti Yuvatha,Telugu Kavithalu