2024-10-15 03:44:42.0
మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీ మీడియా సమావేశం
https://www.teluguglobal.com/h-upload/2024/10/15/1368965-ec.webp
దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలవనున్నది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనున్నది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నేడు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది. ఈ మేరకు మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉన్నది.
288 సీట్ల మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26తో ముగియనున్నది. అంటే అంతకుముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. 81 స్థానాలతో కూడిన జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం 2025 జనవరి 5తో ముగుస్తుంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో 50 స్థానాలకు ఉప ఎన్నికలకు గడువు ఉన్నందున, ఈసీ వాటికి కూడా ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నది.
Maharashtra and Jharkhand elections,Schedule today,EC media conference,at 3.30 pm