https://www.teluguglobal.com/h-upload/2024/11/10/1376543-india.webp
2024-11-10 10:36:46.0
Second T20 match with Safaris today ..changed timings
భారత్, దక్షిణాప్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరిస్‌లో నేడు గెబేహాలో జరిగే రెండో మ్యాచ్‌లో టైమింగ్ లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. రెండో టీ-20 ఒక గంట ముందుగానే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. 7.00 గంటలకు టాస్ వేయనున్నారు. మరోవైపు గెబేహా ఆతిథ్యం ఇస్తున్న రెండో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ జరగడం కష్టంగానే కనిపిస్తోంది. మ్యాచ్ మొదలవడానికి ముందే వరుణుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాన కారణంగా టాస్ ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. టైమ్‌కు టాస్ వేసినా.. ఫస్ట్ ఇన్నింగ్స్ మధ్యలో వరుణుడు గేమ్‌కు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మధ్యలో ఒకట్రెండు గంటల పాటు వర్షం కురిస్తే తిరిగి గ్రౌండ్‌ను రెడీ చేయడానికి సమయం పడుతుంది.