https://www.teluguglobal.com/h-upload/2022/12/13/500x300_430983-today-13-12-2022-slightly-reduced-gold-rate-and-silver-prices.webp
2022-12-13 03:07:59.0
మంగళవారం బంగారం పది గ్రాములపై రూ.110 వరకు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధరపై (10 గ్రాములు) రూ.100 మేర తగ్గి 49,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గి రూ.54,330కి చేరుకుంది.
సాధారణంగానే మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో కాస్త ధర తగ్గితే బాగుండు అని అనుకోని వారు ఎవరుంటారు? అయితే నేడు అందరూ కోరుకున్నట్టుగానే బంగారం ధర అత్యంత స్వల్పంగా తగ్గింది. ఇంత స్వల్ప తగ్గుదలను పరిగణలోకి తీసుకోకున్నా కూడా నిన్న బంగారం ధర స్థిరంగా ఉండటం.. నేడు అంతో ఇంతో తగ్గడం ఊరట కలిగిస్తోంది. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో పెట్టుబడిగా కూడా కొనుగోలు చేసేవారున్నారు. వెండిధర కూడా స్వల్పంగా తగ్గింది. మంగళవారం బంగారం పది గ్రాములపై రూ.110 వరకు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధరపై (10 గ్రాములు) రూ.100 మేర తగ్గి 49,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గి రూ.54,330కి చేరుకుంది. అలాగే వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. వెండి ధర కిలోపై రూ.900 వరకూ తగ్గింది. ఇక దేశంలో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ. 49,800.. రూ. 54,330
విజయవాడలో రూ. 49,800.. రూ. 54,330
విశాఖపట్నంలో రూ. 49,800.. రూ. 54,330
చెన్నైలో రూ. 50,450.. రూ. 55,040
బెంగళూరులో రూ. 49,850.. రూ. 54,390
కేరళలో రూ. 49,800.. రూ. 54,330
కోల్‌కతాలో రూ. 49,800.. రూ. 54,330
న్యూఢిల్లీలో రూ. 49,950.. రూ. 54,490
ముంబైలో రూ. 49,800.. రూ. 54,330
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,800
విజయవాడలో రూ. 72,800
విశాఖపట్నంలో రూ. 72,800
చెన్నైలో రూ. 72,800
కేరళలో రూ. 72,800
బెంగుళూరులో రూ. 72,800
కోల్‌కతాలో రూ. 69,000
ఢిల్లీలో రూ. 69,000
ముంబైలో రూ. 69,000
Slightly Reduced,gold Rate,silver prices,HYD,Chennai,Mumbai
Slightly Reduced, gold Rate, silver prices, HYD, Chennai, Mumbai,
https://www.teluguglobal.com//business/today-13-12-2022-slightly-reduced-gold-rate-and-silver-prices-552703