నేడే భారత్‌-ఆసీస్‌ మధ్య తొలి సెమీస్‌ మ్యాచ్‌

2025-03-04 06:08:38.0

పిచ్‌లు తమకు కొత్తే అన్న రోహిత్‌.. టీమిండియాపైనే ఒత్తిడి ఉంటుందన్నఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హడిన్‌

దుబాయ్‌ వేదికగా నేడు భారత్‌-ఆసీస్‌ మధ్య తొలి సెమీస్‌ మ్యాచ్‌ జరగనున్నది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభమౌతుంది. ఇప్పటికే దుబాయ్‌ పిచ్‌ అడ్వాంటేజ్‌పై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ స్పష్టత ఇచ్చిన విషయం విదితమే. నాలుగు పిచ్‌ల్లో దేనిని వాడుతారనేది తమకు తెలియదని.. తమకూ కొత్తదే అవుతుందని వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హడిన్‌ భారత్‌ను టార్గెట్‌ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. దుబాయ్‌లో వారికి అడ్వాంటేజ్‌ అంటూనే ఒత్తిడీ ఎక్కువగానే ఉంటుందని తెలిపాడు. అలాగే కోచ్‌ గౌతమ్‌ గంబీర్‌ సామర్థ్యాలకు కఠిన పరీక్షేనని వ్యాఖ్యానించాడు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ లో భారత్‌ మాత్రమే ఒకే మైదానంలో ఆడే అవకాశం కలిగిన జట్టు. దుబాయ్‌ పిచ్‌పై పచ్చిక ఉండదు. చాలా పొడిగా ఉంటుంది. భారత్‌కు చాలా సౌకర్యవంతమైన పిచ్‌. అదేసమయంలో టీమిండియాపైనే అదనపు ఒత్తిడి ఉంటుందని భావిస్తున్నాను. ఇప్పటివరకు మంచి క్రికెట్‌ ఆడిన ఆ జట్టుకు కఠిన సవాల్‌ తప్పదు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా సెమీస్‌కు చేరుకున్నందుకు గర్వపడుతున్నా. ఇప్పుడీ పోరులో ఆసీస్‌పై అసలు ఒత్తిడే లేదనుకుంటున్నాను. తప్పకుండా భారత్‌ణ ఓడించి ఫైనల్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆసీస్‌ పరాజయం పాలైనా పెద్దగా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇక రేపు రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ఈనెల 9న ఛాంపియనస్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్నది.

India vs Australia,Champions Trophy 2025 Semi-Final,All or nothing for Rohit,IND as AUS hurdle awaits,Brad Haddin