2025-01-31 10:09:55.0
కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు
రాష్ట్రంలో ఒక్క పథకం సరిగా అమలు కావడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరు.. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది నేను చెప్పిన ప్రజలు వినలేదు.. అత్యాశకు పోయి కాంగ్రెస్ కి ఓటేశారు. రైతు బంధుకి రాం రాం, దళితబంధుకి జై భీం చెబుతారని ఆనాడే చెప్పాను. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కి ఓటేశారు. రాబోయే రోజుల్లో విజయం మనదే. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని కేసీఆర్ పేర్కొన్నారు

కరోనా టైంలో కూడా తాను రైతుబంధు ఆపలేదని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో అమలు చేసిన రైతు బీమాతో ఎంతో మందికి మేలు జరిందని గులాబీ బాస్ అన్నారు. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తే నట్టేట ముంచారని ఆయన మండిపడ్డారు. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టిడం తనకు అలవాటు అని కేసీఆర్ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో విజయం మనదే. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలి.ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. భూముల ధరలు అమాంతం పడిపోయాయి. చారిత్రక సందర్భంలో తెలంగాణ జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిలలాడింది.. సర్వనాశనం అయింది. తాను చెప్పినా ప్రజలు వినలేదని.. అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారన్నారు. రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీం చెబుతారని తాను ఎన్నికల సమయంలోనే చెప్పానని గుర్తు చేశారు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటు వేశారన్నారు. రాబోయే రోజుల్లో విజయం మనదేనన్నారు. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలన్నారు. ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి నెలాఖరులో భారీ సభ పెడుతామని.. బీఆర్‌ఎస్ శ్రేణులు తరలిరావాలని కోరారు.
KCR,BRS Party,CM Revanth reddy,Congress party,Raitu bandhu,Telangana People,Dalit bandhu,KTR